వైసీపీ విజయ దుందుభి మోగించబోతోంది: తమ్మినేని సీతారాం

  • జగన్ కు చారిత్రాత్మక విజయం అందించబోతున్నారు
  • చంద్రబాబు ఏపీకి ఏం సాధించలేక చతికిలపడ్డారు
  • ఎన్టీఆర్ స్ఫూర్తిని పాతిపెట్టేశారు
ఏపీలో వైసీపీ విజయ దుందుభి మోగించబోతోందని ఆ పార్టీ సీనియర్ నేత తమ్మినేని సీతారాం ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఏపీ ప్రజలు వైఎస్ జగన్ కు చారిత్రాత్మక విజయాన్ని అందించబోతున్నారని అన్నారు. అసెంబ్లీ స్థానాల్లోనే కాదు పార్లమెంట్ స్థానాల్లోనూ వైసీపీ విజయ దుందుభి మోగించబోతోందని ధీమా వ్యక్తం చేశారు.

 నాలుగేళ్లు బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు ఏపీకి ఏం సాధించలేక చతికిలపడ్డారని అన్నారు. తన చేతగాని తనాన్ని చాటుకున్న చంద్రబాబు తిరిగి కేంద్రంపైనే విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో చంద్రబాబు ఎప్పుడైతే చేతులు కలిపారో అప్పుడే ఎన్టీఆర్ స్ఫూర్తిని పాతిపెట్టేశారని విమర్శించారు. నాడు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఆవిర్భవించిన టీడీపీ భారతదేశ రాజకీయాల్లో నేడు చరిత్ర హీనంగా మిగిలిపోయిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Go Back to Shorts
YSRCP
tammineni
sitraram
Telugudesam
Chandrababu

More Telugu News